: అమీర్ ఖాన్ న్యూడ్ పోస్టర్ పై కోర్టులో పిటిషన్
తాజాగా విడుదలైన నటుడు అమీర్ ఖాన్ 'న్యూడ్ పోస్టర్' వివాదాన్ని రేపుతోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'పీకే'(PK) చిత్రానికి సంబంధించి దర్శకుడు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఒంటిపై నూలుపోగన్నది లేకుండా, కేవలం ఓ రేడియోని ఆచ్చాదనగా ఉంచుకుని, సీరియస్ గా చూస్తున్న అమీర్ ఫోజు అందర్నీ షాక్ కు గురి చేస్తోంది. దీనిపై ఓ న్యాయవాది కోర్టులో సవాల్ చేశాడు. పోస్టర్ లైంగిక హింస ప్రేరేపించేలా ఉందని, అంతేగాక అసభ్యతను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని పిటిషన్ లో ఆరోపించాడు. ఈ నెల 7న దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.