: నేడే నల్సార్ లా యూనివర్శిటీ స్నాతకోత్సవం


అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం దేశ విదేశాల్లో విద్యా సుమాలను వెదజల్లుతోంది. 16 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ వర్శిటీ... 2003లో మొదటి స్నాతకోత్సవాన్ని జరుపుకుంది. తొలి స్నాతకోత్సవానికి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం హాజరయ్యారు. ఇవాళ జరిగే 12వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరవుతున్నారు. 1998 జూన్ 15న శామీర్ పేటలో 55 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నల్సార్ యూనివర్శిటీ ఏర్పాటైంది. 16 ఏళ్లుగా స్వదేశీ విద్యార్థులతో పాటు... సార్క్ దేశాలకు చెందిన విద్యార్థులకు న్యాయశాస్త్ర విద్యను అందిస్తోంది. నల్సార్ లోని నాలుగేళ్ల లా కోర్సులో చేరేందుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతియేటా 80 మంది విద్యార్థులకు మాత్రమే ఇక్కడ ప్రవేశం లభిస్తుంది. ఇప్పటివరకు 780 మంది విద్యార్థులు లా కోర్సును పూర్తిచేశారు. నల్సార్ లో భారత్, నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తో పాటు ఇంగ్లండ్ కు చెందిన విద్యార్థులు న్యాయవిద్యను అభ్యసించారు. కోర్సు పూర్తయిన వెంటనే కార్పొరేట్ సంస్థలు పోటీపడి మరీ ఉద్యోగాలిస్తున్నాయి. నేడు జరిగే స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యఅతిథిగా హాజరవుతుండగా, గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొంటున్నారు. దీంతో, నల్సార్ వర్శిటీలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News