: ఆర్టీసీ బస్సు పంట చేనులోకి దూసుకెళ్లింది


కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. కోరుట్ల మండలంలోని మోహనరావుపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ నుంచి నిజామాబాదుకు వెళుతున్న ఈ బస్సు మోహనరావుపేట శివారులో కల్వర్టును ఢీకొని అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వారికి స్వల్ప గాయాలయినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News