: పాలమూరు ఎత్తిపోతల పథకం డీపీఆర్ పై ఆదేశాలు జారీ
పాలమూరు ఎత్తిపోతల పథకం సమగ్ర సర్వే నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డీపీఆర్ తయారు చేసే బాధ్యతను ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఇందుకోసం రూ. 5,71,22,498 నిధులను విడుదల చేసింది. సర్వేతో పాటు రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్ మెంట్ పై కూడా రిపోర్టును మూడునెలల్లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.