: నోవాటెల్ లో నోరూరిస్తున్న బెంగాలీ రుచులు
హైదరాబాదు నోవాటెల్ హోటల్ లోని స్క్వేర్ రెస్టారెంట్ లో బెంగాలీ రుచులు నోరూరిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు డిన్నర్ సమయాల్లో ‘బెంగాలీ ఫుడ్ ఫెస్టివల్’ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భాపా ఇలీస్, పాప్డా షోర్ సీ, భెత్కీ, పాట్ పురీ వంటకాలను తాను సిద్ధం చేస్తున్నట్లు చెఫ్ అర్నబ్ చెప్పారు. షుక్టో, అంబోల్స్, వెజిటబుల్ రైస్ వంటి వంటకాలను తాను రూపొందిస్తానని చెఫ్ బిప్లాబ్ తెలిపారు. డిన్నర్ సమయాల్లో మాత్రమే జరిగే ఈ ఫెస్టివల్ బఫే కోసం సాధారణ రోజుల్లో రూ.1300 రూపాయలు, శుక్రవారం నుంచి ఆదివారం వరకు 1650 రూపాయలు వసూలు చేస్తున్నారు.