: వరద నీటితో కళకళలాడుతున్న కృష్ణమ్మ
కృష్ణానది వరద నీటితో కళకళలాడుతోంది. దాంతో జూరాల, శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు నిండుగా ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం డ్యాం వరదనీటితో పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 855 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 841 అడుగులు ఉంది. ఇన్ ఫ్లో 1,49,238 క్యూసెక్కులు. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్కేంద్రానికి 4,944 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో 20 గేట్లు ఎత్తి వేసి 1.1 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయానికి వరదనీరు పోటెత్తింది. జూరాల డ్యాం 28 గేట్లు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్ ఫ్లో 1,39,969 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,50,938 క్యూసెక్కులు.