: ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో లోకేష్ ఆఫీస్


టీడీపీ యువనేత నారా లోకేష్ కు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆఫీసు సిద్ధమవుతోంది. తాజా ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు పాత్ర పోషించిన లోకేష్ రోజూ పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. లోకేష్ ను కార్యకర్తల నిధి సమన్వయ కర్తగా నియమించడంతో ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో పూర్తి స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన పనులు జోరందుకున్నాయి. రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పార్టీ కార్యాలయంలో పనులు చక్కబెడుతున్న లోకేష్ కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. తెలంగాణలోని ముఖ్య నేతలతో వేర్వేరుగా చర్చలు జరుపుతూ బిజీగా ఉంటున్నారు. లోకేష్ కు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లోని రెండో అంతస్థులో చంద్రబాబు నాయుడు ఛాంబర్‌కు ఎదురుగా గది కేటాయించారు. గతంలో ఈ గదిని టీడీపీ నేత నామా నాగేశ్వరరావు ఉపయోగించుకునేవారు.

  • Loading...

More Telugu News