: కన్నీరు పెట్టిన దర్శకుడ్ని సముదాయించిన ఎన్టీఆర్
సినిమా సందర్భంగా తాను అనారోగ్యానికి గురైతే, కష్టకాలంలో తనను ఆదరించిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెలిపారు. ‘రభస’ ఆడియో విడుదల సందర్భంగా ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఈ సినిమా పూర్తయిందంటే దానికి కారణం జూనియర్ ఎన్టీఆరేనని, సినిమాకు లభించిన ప్రతి పొగడ్త ఆయనకే చెందాలని అంటూ ఆయన భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంలో అంతా మంచే జరుగుతుందని జూనియర్ ఎన్టీఆర్ అతనిని సముదాయించి అభిమానుల మనసు గెలుచుకున్నాడు.