: 'రాకాసి రాకాసి...రబ్బరు బంతిలా ఇసిరేసి': పాటతో అలరించిన ఎన్టీఆర్
'రాకాసి రాకాసి... రబ్బరు బంతిలా ఇసిరేసి' అంటూ జూనియర్ ఎన్టీఆర్ పాడిన పాట అందర్నీ అలరించింది. 'రభస' ఆడియో వేడుకలో ఈ పాటను ఆవిష్కరించిన సందర్భంగా అందరూ మంత్ర ముగ్థులయ్యారు. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్ మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించారని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆ పాటకు జూనియర్ ఎన్టీఆర్ గొంతు సవరించాడనే ఆనందంతో పాటు... పాటకు సాహిత్యం మరింత వన్నె తెచ్చిందని అభిమానులు హర్షాతిరేకం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను పాడాలని అభిమానులు కోరగా... సినిమాలో చూస్తేనే బాగుంటుందని కార్యక్రమ వ్యాఖ్యాత సుమ తెలపడంతో అభిమానులు శాంతించారు.