: ఎన్టీఆర్ తో పని చేయడానికి పుణ్యం చేయాలి: ప్రణీత


జూనియర్ ఎన్టీఆర్ నటనను చూడాలంటేనే అదృష్టం ఉండాలని వర్థమాన నటి ప్రణీత తెలిపారు. ‘రభస’ ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశం దొరకాలంటే పుణ్యం చేసుకుని ఉండాలని, అలాంటి అదృష్టం తాను చేసుకున్నానని అన్నారు. ఆయన నటన, డ్యాన్సులోని వేగం అసామాన్యమని ఆమె తెలిపారు. ఆయనతో పోటీపడి నటిస్తే చాలని ఆమె చెప్పారు. అలాగే సమంతతో కలిసి మరోసారి నటించడం చాలా బాగుందని ఆమె వెల్లడించారు. సినిమా చాలా బాగుంటుందని, అభిమానులను అలరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News