: ఈ నెల 8 నుంచి ‘మన గుడి’ కార్యక్రమం ప్రారంభం
ఆగస్టు 8వ తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ‘మన గుడి’ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా తిరుపతి సమీపంలో ఉన్న శ్రీనివాస మంగాపురం కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ‘మన గుడి’ కార్యక్రమ రథాన్ని ఆయన ప్రారంభించారు.