: అక్కడి నుంచి గంధపు చెట్లు మాయమవుతున్నాయ్!
హైదరాబాద్ బహదూర్ పురాలో నున్న జవహర్ లాల్ నెహ్రూ జంతుప్రదర్శనశాల (జూపార్కు)లో ఉన్న గంధపు చెట్లు మాయమవుతున్నాయి. ఇటీవలే రెండు గంధపు చెట్లు మాయమయ్యాయని పోలీస్ స్టేషనులో ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారం ఇప్పటిది కాదు... దాదాపు పన్నెండేళ్ల నుంచి ఈ తతంగం కొనసాగుతోంది. ఈ విషయంలో ఇంటి దొంగల పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, జూ అధికారులు మాత్రం గంధపు చెట్ల వ్యవహారంలో సెక్యూరిటీ వ్యవస్థను పెంచుతామని, ఈ వ్యవహారంలో దోషులుగా తేలితే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న జూపార్కులో చెట్లు విస్తారంగా ఉన్నాయి. వాటిలో గంధపు చెట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి.