: బాక్సింగ్ లో బోణీ కొట్టిన భారత్
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో బాక్సింగ్ లో భారత్ బోణీ కొట్టింది. బాక్సింగ్ 51 కిలోల మహిళల విభాగంలో పింకీకి కాంస్య పతకం లభించింది. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ ఇప్పటివరకు రెజ్లింగ్, షూటింగ్ విభాగాల్లోనే ఎక్కువగా పతకాలను సాధించింది. నిన్న జిమ్నాస్టిక్స్ లో భారత్ తొలి పతకం అందుకోగా, తాజాగా బాక్సింగ్ లోనూ కాంస్య పతకాన్ని దక్కించుకుంది.