: కేసీఆర్ ను కలిసిన ఫార్మా కంపెనీ ప్రతినిధులు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో ఫార్మా కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఫార్మాసిటీ ఏర్పాటుపై ప్రధానంగా చర్చించారు. భేటీ అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... ఏడు వేల ఎకరాల్లో ఫార్మాసిటీని నిర్మిస్తామని చెప్పారు. దీని ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేస్తామన్నారు. కాలుష్య రహితంగా ఫార్మాసిటీని తీర్చిదిద్దుతామని కేసీఆర్ చెప్పారు. దీనికి 500 మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేస్తామని ఆయన అన్నారు. జీడిమెట్లలో ఉన్న ఫార్మా కంపెనీలను ఫార్మాసిటీకి తరలిస్తామని ఆయన చెప్పారు.