: నేలకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం... పైలట్ సేఫ్


భారత వాయుసేనకు చెందిన ఓ జెట్ విమానం గుజరాత్ లో నేలకూలింది. రోజువారీ శిక్షణలో భాగంగా ఈ ఉదయం భుజ్ ఎయిర్ బేస్ నుంచి నింగికెగిసిన జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలోని నఖ్త్రానా ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ ఎజెక్షన్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని సురక్షితంగా బయటపడ్డాడు. విమానం నిర్జన ప్రదేశంలో కూలిపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఘటనపై భారత వాయుసేన కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించింది.

  • Loading...

More Telugu News