: ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు భారత జట్టు ఎంపిక ఈనెల 7న


ప్రస్తుతం ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న టీమిండియా ఆగస్టు 25 నుంచి ఐదు వన్డేల సిరీస్ లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఏకైక టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ పరిమిత ఓవర్ల పోటీల్లో పాల్గొనే భారత్ జట్టును ఈనెల 7న ఎంపిక చేయనున్నారు. ఈమేరకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. కాగా, వచ్చే వేసవిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు వన్డే వరల్డ్ కప్ కు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ను ప్రపంచకప్ కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని టీమిండియా వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఇటీవలే బంగ్లాదేశ్ లో పర్యటించిన జట్టు రైనా నేతృత్వంలో కొన్ని మ్యాచ్ లు ఆడినా, అప్పటి జట్టులో సీనియర్లెవరూ లేరు. ధోనీ, రోహిత్ శర్మ, కోహ్లీ వంటి స్టార్లు విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై పూర్తిస్థాయి జట్టుతో బరిలో దిగాలని టీమిండియా తలపోస్తోంది.

  • Loading...

More Telugu News