: 'కామన్వెల్త్' విజేతలకు రాష్ట్రపతి అభినందనలు
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు క్రీడాకారులకు లేఖలు రాశారు. పతకం సాధించిన ప్రతి అథ్లెట్ కు ఆయన వేర్వేరుగా ఉత్తరాలు రాయడం విశేషం. భవిష్యత్తులోనూ ఇలాగే విజయాలు సాధించాలని ప్రణబ్ ఆకాంక్షించారు. "మీ విశేష ప్రదర్శన అంతర్జాతీయ యవనికపై భారత సత్తాకు పరాకాష్ఠ" అని పేర్కొన్నారు.