: సుబ్రతా రాయ్ కి సుప్రీంలో స్వల్ప ఊరట


ఐదు నెలల నుంచి తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్న సహారా అధినేత సుబ్రతా రాయ్ కి స్వల్ప ఊరట కలిగింది. జైలు నుంచి పదిరోజుల పాటు సహారా వ్యవహారాలు పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ఆయనను అనుమతించింది. ఈ నెల 5 నుంచి సహారా ఆస్తుల విక్రయంపై చర్చించుకునేందుకు అంగీకరించింది. ఇన్నాళ్ల నుంచి సుబ్రతాకు బెయిల్ నిరాకరించిన సుప్రీం సెబీకి వెయ్యికోట్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో తన ఆస్తులు అమ్మి డబ్బు చెల్లించేందుకు అనుమతి పొందారు. దీంతో, ఇప్పుడు ఆస్తుల అమ్మకానికి సంబంధించి పలువురితో చర్చలు జరపనున్నారు.

  • Loading...

More Telugu News