: ఎర్రచందనం అమ్మి రుణమాఫీ చేస్తామనడం హాస్యాస్పదం: పెద్దిరెడ్డి
ఎర్రచందనం అమ్మి రైతు రుణమాఫీ హామీ నెరవేరుస్తామని టీడీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదం అని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా టన్ను ఎర్రచందనం 2 లక్షల రూపాయలకు అమ్ముడుపోయిందని అన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో నిల్వ ఉన్న ఎర్రచందనం అమ్మితే కేవలం 20 మండలాల రుణమాఫీ చేయడానికే నిధులు సరిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. 35 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామనడం రైతులను మభ్యపెట్టడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని అనడం కూడా ప్రజలను తప్పుదారి పట్టించడమే అవుతుందని ఆయన అన్నారు.