: పెళ్ళి తర్వాత అమ్మాయిల ప్రాధామ్యాల్లో మార్పు!


'పెళ్ళి తర్వాత అమ్మాయి ముఖంలో కళ వచ్చింది' అని అనుకోవడం మనం వింటుంటాం. కళే కాదు వివాహంతో ఆమె ప్రాధామ్యాల్లోనూ మార్పు వస్తుందట. 'జీవన్ సాథి.కామ్' వెబ్ సైట్ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 1500 మంది మహిళలను ప్రశ్నించారు. "పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత మీరు ప్రాధాన్యమిచ్చే అంశాలేమిటి?" అని వారిని అడిగారు. వారు చెప్పిన జవాబులను విశ్లేషిస్తే పెళ్ళికి ముందు ప్రథమ స్థానంలో ఉన్న కెరీర్ అంశం కాస్తా... వివాహం తర్వాత నాలుగోస్థానానికి పడిపోయింది. వివాహిత మహిళల జీవితంలో కెరీర్ స్థానాన్ని పతిదేవుడు ఆక్రమించడం విశేషం. దీన్నిబట్టి చూస్తే..., వివాహానంతరం స్త్రీకి కెరీర్ కంటే భర్తే ముఖ్యమని అర్థమవుతోంది. ఇక భర్త తర్వాత మహిళ ప్రాధాన్యత ఇచ్చే అంశాలు... పిల్లలు, ఆమె తల్లిదండ్రులేనట. వీటన్నిటి తర్వాతే కెరీర్ అని స్త్రీలు భావిస్తున్నారని సదరు అధ్యయనం వెల్లడిస్తోంది.

  • Loading...

More Telugu News