: నడిరోడ్డుపై పెళ్లాం గొంతు కోసేశాడు


అనంతపురం పట్టణంలోని శ్రీకంఠం సర్కిల్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం... సూర్యనగర్ లో నడిరోడ్డుపై భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో భార్యపై భర్త దాడి చేశాడు. దీంతో ఆగ్రహించిన ఆమె ఎదురు తిరిగింది. భార్య ఎదురు తిరగడం తట్టుకోలేకపోయిన భర్త బ్లేడుతో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. దీంతో, స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటీన సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతనికోసం గాలింపు మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News