: నడుం చుట్టుకొలతతో 'షుగర్' ముప్పు పసిగట్టవచ్చట!
సాధారణ వ్యక్తుల కంటే కూడా నడుం చుట్టూ ఎక్కువ కొవ్వు కలిగి ఉన్న వ్యక్తులే ఐదు రెట్లు అధికంగా టైప్ 2 డయాబెటిస్ వ్యాధి బారిన పడతారట. బ్రిటన్ హెల్త్ డిపార్ట్ మెంట్ అనుబంధ సంస్థ పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) డయాబెటిస్ వ్యాధిపై చేపట్టిన పరిశోధన ద్వారా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పురుషుల్లో నడుం చుట్టుకొలత 40 అంగుళాల కంటే ఎక్కువ ఉన్నవారు టైప్ 2 మధుమేహం బారిన పడే చాన్సులు అధికమని, మహిళల్లో నడుం చుట్టుకొలత 34.6 అంగుళాలు దాటితే ప్రమాద ఘంటికలు మోగినట్టేనంటున్నారు. ప్రస్తుతం టైప్ 2 డయాబెటిస్ బాధితుల్లో 90 శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నవారే. ఈ ముప్పు తప్పించుకోవడానికి బరువు తగ్గడం ఒకటే మార్గమని, అయితే, ఆరోగ్యకరమైన రీతిలోనే డైటింగ్ చేయాల్సి ఉంటుందని పరిశోధకులు తెలిపారు.