: కేసీఆర్ ఆ సర్టిఫికెట్ తెచ్చుకోగలరా?: కిషన్ రెడ్డి
తెలంగాణలో ఫీజు రీయింబర్స్ మెంట్ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై బీజేపీ నేత, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో టీ రాష్ట్ర ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయం విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తుందన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, 1956 స్థానికత నేపథ్యంలో కేసీఆర్ తన గ్రామంలో సర్టిఫికెట్ తెచ్చుకోగలడా? అని సూటిగా ప్రశ్నించారు. దాంతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం పరిపక్వతతో ఆలోచించాలని హితవు పలికారు.