: గూగుల్ సైట్ లో 14వందల భారతీయ చారిత్రక కట్టడాలు


భారతీయ చారిత్రక కట్టడాలు, సంస్కృతికి సంబందించిన 1400 కళాకృతులను ఇకపై గూగుల్ వెబ్ సైట్ అయిన గూగుల్ కల్చరల్ ఇన్ స్టిట్యూట్ లో వీక్షించవచ్చునని ఆ సంస్థ ప్రకటించింది. ఇటీవలే సఫ్దర్ జంగ్ సమాధులు, ఎల్లోరా గుహలు, పురాణ కిల్లా లాంటి 75 చారిత్రక ప్రాంతాలను, కట్టడాలను గూగుల్ కల్చరల్ ఇన్ స్టిట్యూట్ (జీసీఐ) సైట్ లో యాడ్ చేశామని గూగుల్ తెలిపింది. భారత ఆర్కియాలజీకల్ సర్వే (ఏఎస్ఐ) సహకారంతో వీటిని జీసీఐ సైట్ లో అప్ లోడ్ చేసినట్లు గూగుల్ పేర్కొంది. ఈ చారిత్రక కట్టడాలను 360 డిగ్రీల కోణంలో జీసీఐ సైట్ లో చూడగలమని గూగుల్ వివరించింది.

  • Loading...

More Telugu News