: 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో చిరంజీవి
తెలుగు చానల్ మాటీవీలో ప్రసారమవుతున్న ప్రముఖ క్విజ్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో నటుడు, రాజకీయ నేత చిరంజీవి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను సదరు చానల్ తాజాగా ప్రసారం చేసింది. ఈ షోలో చిరు పాల్గొంటున్నట్టు మొదట్లో వార్తలు వచ్చినప్పటికీ, ఈ విషయంపై కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. అయితే, చానల్ ప్రసారం చేసిన ప్రోమోతో చిరు పాల్గొన్నట్లు ఖరారైంది. దీనికి సంబంధించిన వీడియోను కూడా మాటీవీ ట్విట్టర్ లో పోస్టు చేసింది. అయితే, చిరంజీవి పాల్గొన్న ఈ షో ఎప్పుడు ప్రసారం అవుతుందన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు.