: ప్రభుత్వానికి, మెట్రో అధికారులకు మధ్య విభేదాల్లేవు: కేటీఆర్
మెట్రోరైలు నిర్మాణానికి సంబంధించి టీఎస్ ప్రభుత్వానికి, మెట్రో అధికారులకు మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలను మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. మెట్రో నిర్మాణపు పనులు సవ్యంగా జరుగుతున్నాయని చెప్పారు. మెట్రో ప్రాజెక్టును పూర్తిచేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని... హైదరాబాద్ ప్రజలకు మెట్రోను కానుకగా ఇస్తామని తెలిపారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెట్రో అండ్ రైల్ టెక్నాలజీ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం 72 కిలోమీటర్ల మేర ఉన్న మెట్రోరైలు మార్గాన్ని భవిష్యత్తులో 200 కిలోమీటర్లకు విస్తరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.