: 10 లక్షలు ముట్టజెప్పినా... బాలుడిని వదలని కిడ్నాపర్లు


పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కిడ్నాప్ కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి కుమారుడు బొమ్మా హరినాథ్ కిడ్నాప్ కు గురయ్యాడు. వారం రోజుల క్రితమే హరినాథ్ ను కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారు. పిల్లవాడిని తిరిగి ఇవ్వాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిడ్నాపర్ల డిమాండ్ మేరకు రూ. 10 లక్షలు వెంటనే ఇచ్చామని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే, కిడ్నాపర్లు డిమాండ్ చేసిన డబ్బులిచ్చినప్పటికీ తమ కుమారుడిని ఇప్పటివరకూ అప్పజెప్పలేదని వారు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఈ కిడ్నాప్ పై దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News