: వచ్చే ఉగాదికే మెట్రో రైలు... భూగర్భ మార్గం ఉండదు: మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి


హైదరాబాదు మెట్రోరైలు పనులు వేగంగా కొనసాగుతున్నాయని... నిర్దేశించిన సమయంలో పనులన్నీ పూర్తవుతాయని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రోరైలు తొలి దశ (నాగోలు-మెట్టుగూడ మధ్య)ను ఉగాది పర్వదినాన ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మరో నాలుగు బోగీలను తెప్పిస్తున్నామని... త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం రూ. 4600 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానిదే అని చెప్పారు. అసెంబ్లీ, ఎంజీఎంల వద్ద భూగర్భ రైలు మార్గం ఉండదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News