: దర్శనమివ్వడానికి మోడీ దేవుడా? :ఖర్గే


కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, లోక్ సభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే మధ్య లోక్ సభలో ఆసక్తికర సంవాదం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ, ప్రధాని రోజూ కాకపోయినా వారానికోసారైనా లోక్ సభకు హాజరుకావాలని సూచించారు. బడ్జెట్ సమావేశాల తరువాత ప్రధాని సభకు రావడం మానేశారని ఖర్గే వ్యాఖ్యానించారు. దీనిపై సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ, ‘ఆయన సభలోనే ఉన్నారు... కావాలంటే ఇప్పుడే అయన దర్శనం చేసుకోండి’ అంటూ సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఖర్గే 'దర్శనం ఇవ్వడానికి మోడీ ఏమైనా దేవుడా?' అని ప్రశ్నించారు. దీనిపై కాసేపు సభలో వాగ్వాదం, గందరగోళం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News