: మూడో టెస్ట్ లో భారత్ ఘోరపరాజయం
భారత్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ 266 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో కాస్త మెరుగ్గా ఆడిన భారత బ్యాట్స్ మెన్... రెండో ఇన్నింగ్స్ లో పూర్తిగా చేతులెత్తేశారు. చివరి రోజు అజింక్య రహానే 52 పరుగులు చేసి పోరాడినా అతనికి మిగతా బ్యాట్స్ మెన్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. దీంతో భారత్ కు ఓటమి తప్పలేదు. ఐదు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో టెస్టు గెలిచి సమ ఉజ్జీలుగా నిలిచాయి. మొదటి టెస్టు డ్రా కాగా, రెండో దాన్ని భారత్, మూడోదాన్ని ఇంగ్లాండ్ గెలుచుకున్నాయి. మూడో టెస్టు స్కోరు వివరాలు : మొదటి ఇన్నింగ్స్ : ఇంగ్లాండ్ :569/7 డిక్లేర్డ్, భారత్ :330 అలౌట్... రెండో ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ : 205/4 డిక్లేర్డ్, భారత్ :178 ఆలౌట్.