: తణుకులో రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సీజ్


పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో జయంతి జువెలరీ షాప్ పై గత అర్ధరాత్రి ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సరైన పత్రాలు లేని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అనంతరం సీజ్ చేశారు. షాపు యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ ఆభరణాల విలువ రూ. 2 కోట్లకు పైగా ఉంటుందని ఐటీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News