: నేటి నుంచి తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత


తిరుమలలో ఉన్న శ్రీవారి పుష్కరిణిని ఈ రోజు నుంచి మూసివేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణి మరమ్మతు పనులు చేపడుతుంటారు. ఇందులో భాగంగానే పుష్కరిణిని మూసివేశారు. ఈ పనులు ఆగస్టు 30 వరకు కొనసాగుతాయి. దీంతో, ప్రతిరోజు తిరువీధుల్లో స్వామి వారి ఊరేగింపు సందర్భంగా ఇచ్చే పుష్కర హారతిని కూడా అప్పటి వరకు రద్దు చేశారు. పుష్కరిణి మూతపడటంతో... ప్రత్యామ్నాయంగా కోనేటికి పడమర వైపు స్నాన గదులను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News