: బంగారం అక్రమ రవాణాకు అడ్డా... శంషాబాద్ ఎయిర్ పోర్ట్


శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం అక్రమరవాణా కొనసాగుతూనే ఉంది. రెండు రోజులకొకసారి ఎవరో ఒకరు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం అక్రమ రవాణాతో పట్టుబడుతున్నారు. తాజాగా శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద అరకిలో బంగారం పట్టుబడింది. సింగపూర్ నుంచి వచ్చిన అశోక్ లాల్ అనే ప్రయాణికుడి వద్ద లభించిన అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దగా తనిఖీ లు లేకపోవడం, అంతంతా మాత్రంగా ఉన్న భద్రతా చర్యల కారణంగానే శంషాబాద్ ఎయిర్ పోర్టును లక్ష్యంగా చేసుకుని బంగారం తరలింపుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తూ ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News