: అమెరికా అధ్యక్షుడు ఒబామాను విచారించనున్నారు!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విచారణ ఎదుర్కోబోతున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. విచారణకు ఆ దేశ ప్రజాప్రతినిధుల సభ కూడా అనుమతించింది. దీనికి సంబంధించి జరిగిన ఓటింగ్ లో విచారణకు అనుకూలంగా 225 ఓట్లు పడగా... వ్యతిరేకంగా 201 ఓట్లు వచ్చాయి. వివిధ సంస్థల్లో ఉద్యోగుల ఆరోగ్య రక్షణ సహా పలు చట్టాలకు సంబంధించి... చట్ట సభల అనుమతి లేకుండానే... ఒబామా నిరంకుశంగా నిర్ణయాలు తీసుకున్నారనేది ఆయనపై ఉన్న ఆరోపణ. ఏకపక్ష నిర్ణయాలతో ఒబామా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రతిపక్ష రిపబ్లికన్లు గత కొంత కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఒబామాపై విచారణకు సంబంధించి సభలో ఓటింగ్ జరిగింది.