: సెమీస్ చేరిన భారత హాకీ జట్టు
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు సెమీస్ కు దూసుకుపోయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 5-2 తేడాతో జయభేరి మోగించింది. 4వ నిమిషంలో రఘునాథ్, 8వ నిమిషంలో రూపిందర్ పాల్, 22వ నిమిషంలో రమణ్ దీప్ సింగ్, 26వ నిమిషంలో ఎస్.వి.సునీల్, 58వ నిమిషంలో మన్ ప్రీత్ సింగ్ లు గోల్స్ సాధించారు. ఈ విజయంతో పూల్-ఏలో భారత్ ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. సెమీస్ లో న్యూజిల్యాండ్ తో భారత్ తలపడుతుంది.