: ఫేస్ బుక్ పై ఏకంగా రూ. 725 కోట్లకు దావా


ప్రముఖ సామాజిక వెబ్ సైట్ ఫేస్ బుక్ కు ఊహించని రీతిలో కొత్త తలనొప్పి వచ్చిపడింది. అమెరికాకు చెందిన మరియం అనే మహిళ ఏకంగా రూ. 725 కోట్లకు ఫేస్ బుక్ పై దావా వేసింది. వివరాల్లోకి వెళ్తే... టెక్సాస్ కు చెందిన మరియం, ఇల్లినాయిస్ కు చెందిన అదీల్ షా ఖాన్ ఇద్దరూ స్నేహితులు. కొన్ని విభేదాలతో ఇద్దరూ విడిపోయారు. మరియంపై కోపం పెంచుకున్న అదీల్ షా... మరియం పేరుతో పేస్ బుక్ ఖాతా తెరిచి... ఆమెకు సంబంధించిన అశ్లీల నకిలీ ఫొటోలను అప్ లోడ్ చేశాడు. విషయాన్ని తెలుసుకున్న మరియం ఆ ఫొటోలను తీసివేయాలని ఫేస్ బుక్ కు విన్నవించింది. అయినా, ఫేస్ బుక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తన విన్నపాన్ని ఉద్దేశపూర్వకంగానే ఫేస్ బుక్ విస్మరిస్తోందని మరియం కోర్టు కెక్కింది. ఏకంగా రూ. 725 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేసింది.

  • Loading...

More Telugu News