: తైవాన్ లో ఘోర విమాన ప్రమాదం
మలేసియా విమాన ప్రమాదంలో మృతదేహాలు ఇంకా ఇళ్లకు చేరక ముందే మరో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ ఏషియాకు చెందిన విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో తైవాన్ లో కుప్పకూలింది. దీంతో దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 51 మంది ప్రయాణికులు మృతి చెందారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.