: తమిళ హీరోపై అభిమానం కురిపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు హేట్సాఫ్: నాగార్జున
హైదరాబాదు శిల్పకళావేదికలో జరుగుతోన్న ‘సికిందర్’ సినిమా ఆడియో వేడుకలో అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన సూర్యా, సమంత కూడా అభిమానులనుద్దేశించి మాట్లాడారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ... తమిళ హీరో అయిన సూర్యపై ఇంతటి అభిమానాన్ని కురిపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు హేట్సాఫ్ అని అన్నారు. వేదికపైనున్న సమంతాను ‘మా అమ్మ’ అని సంబోధించారు (మనం సినిమాలో నాగార్జునకు తల్లిగా సమంతా చేసిన విషయం తెలిసిందే)! సూర్యా మంచి నటుడిని, అంతకు మించి మంచి మనసున్న వ్యక్తి అని నాగార్జున ప్రశంసించారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన లింగుస్వామిని ప్రత్యేకంగా అభినందించారు. లింగుస్వామిని ఉద్దేశించి... ‘మీరు ఎప్పుడూ తమిళ సినిమాలే చేస్తారా? తెలుగులో చేయరా?' అని అడిగారు. తెలుగులో సినిమా చేస్తే తాను నటించేందుకు సిద్ధమని నాగ్ అన్నారు.