: తెలంగాణలో ఫార్మాసిటీతో పాటు... కెమికల్ సిటీ, సినిమా సిటీ: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో కెమికల్ సిటీ నిర్మిస్తామని, సినిమా సిటీని కూడా ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనపై కేసీఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో ఇనుప ఖనిజం లభ్యమవుతోందని, దీంతో అక్కడ ఫ్యాక్టరీని నిర్మించేందుకు సెయిల్ ముందుకు వచ్చిందన్నారు.