: శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ. కోటి 78 లక్షలు


కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మల్లన్న హుండీ ఆదాయాన్ని లెక్కించారు. భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామివార్ల హుండీ లెక్కింపులో కోటి 78 లక్షల 88 వేల 959 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తులు సమర్పించిన కానుకల రూపేణా ఆ ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. ఈ ఆదాయం 33 రోజుల్లో వచ్చిందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News