: రంగుల బట్టలు ధరించకూడదు...ఏ భాగమైనా కనిపించిందా... ఖబడ్దార్!


ఓ వైపు గ్లోబలైజేషన్ తో ప్రపంచం దూసుకెళ్తోంది... మరో వైపు అదే ప్రపంచం రాతియుగంలోకి మరలుతోంది. తాజాగా మహిళలపై జీహాదీల ఆంక్షలు రాతి యుగాన్ని గుర్తుకు తెస్తున్నాయి. సంస్కృతి, సంప్రదాయం పేరిట మహిళలకు బంధనాలు వేస్తున్నారు. సిరియాలో మహిళల శరీరంలోని ఏ అవయవం కనిపించడానికి వీలు లేదని ఫత్వా జారీ చేశారు. కనీసం కళ్లు కనిపించడానికి కూడా వీలు లేదని ఆదేశించారు. మహిళలు రంగురంగుల వస్త్రాలు ధరించేందుకు వీలు లేదు. వస్త్రాలపై పూసల వంటి అలంకరణ వస్తువులు ఉండరాదు. హైహీల్స్ చెప్పులేయకూడదు... ఈ ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు శిక్షలు కూడా భరించాల్సి ఉంటుందని జీహాదీలు స్పష్టం చేశారు. మొన్నే ఇరాక్ లో ఐఎస్ఐస్ తీవ్రవాదులు కూడా ఇలాంటి ఆక్షలే విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News