: ఒక్క హామీ కూడా అమలు చేయలేదు!: డీకే అరుణ
టీఆర్‌ఎస్ అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తవుతున్నా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, హామీల అమలు సంగతి దేవుడెరుగు... కనీసం ఇచ్చిన హామీలపై స్పష్టమైన కార్యాచరణ కూడా ప్రకటించలేదని అన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తమ పార్టీలో సమర్ధుడైన నేత లేనందునే ఓటమిపాలైందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ లీడర్‌ను ఎంచుకుని... ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదేమోనని ఆమె అభిప్రాయపడ్డారు.