: స్మార్ట్ ఫోన్ ...ఆమె సంసారంలో చిచ్చుపెట్టింది
స్మార్ట్ ఫోన్ పచ్చిని సంసారంలో చిచ్చు రేపింది. సాంకేతిక పరిజ్ఞానంపై మోజు కొంత మంది జీవితాలను బలితీసుకుంటోంది. ఫేస్ బుక్ వ్యసనంగా మారిపోయి తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్న చాలామంది గురించి మనం ప్రతిరోజూ చదువుతూనే ఉన్నాం. స్మార్ట్ ఫోన్ కు బానిసగా మారిందనే కారణంతో తైవాన్ లో ఓ భర్త విడాకుల కోసం కోర్టుకెక్కాడు. స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారిన తన భార్య ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేస్తోందని వాపోయాడు. స్మార్ట్ ఫోన్ కారణంగా తన చిన్నకుమార్తెకి వ్యాక్సిన్ వేయించడం కూడా మర్చిపోయిందని కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంత చెప్పినా ఆమె వైఖరిలో మార్పు లేదని, అందుకే విడాకులు కోరాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తనను వదిలించుకోవడానికి ఇదో సాకని, తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అతని భార్య కోర్టుకు తెలిపింది.