: గజ్వేల్ నియోజకవర్గానికి రూ.25 కోట్లు కేటాయింపు
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీనికి సంబంధించి ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. గజ్వేల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేేసీఆర్ సొంత నియోజకవర్గమన్న విషయం విదితమే. గజ్వేల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీకి 25 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. కేసీఆర్ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.