: పెద్దల సభ నుంచి ఎన్నికవుతోన్న మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ పెద్దల సభ నుంచి ఎన్నికవనున్నారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ ద్వారా ఆగస్టు 21న జరగనున్న ఉప ఎన్నిక ద్వారా ఆయన విధాన పరిషత్ కు ఎన్నిక కానున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత అయిన నారాయణ రాజకీయ రంగ ప్రవేశం జరిగిన అతి తక్కువ కాలంలోనే మంత్రి పదవి చేపట్టారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆయనను ఎమ్మెల్సీగా టీడీపీ గెలిపించుకోనుంది.