: ఇద్దరు చైనీయులకు మెగసెసె అవార్డులు


ఆసియా నోబెల్ బహుమతిగా పిలుచుకునే ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం ఆరుగురు వ్యక్తులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వారిలో ఇద్దరు చైనీయులు. జర్నలిస్టు హు షూలీ (61), న్యాయవాది వాంగ్ కన్ఫా (55) మెగసెసె తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. షూలీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా చైనా అధికార వర్గంలో పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతున్న విషయాన్ని బట్టబయలు చేశారు. ఇక పర్యావరణ అంశాలపై పలు కేసులను ఉచితంగా వాదించి కన్ఫా తన మానవత్వాన్ని, సామాజిక స్పృహను చాటుకున్నారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే క్రమంలో ధైర్యసాహసాలు కనబర్చిన ఒమారా ఖాన్ మసౌది, ఇండోనేసియా ఆదివాసీల పిల్లల కోసం విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఆంత్రోపాలజిస్ట్ సౌర్ మార్లినా మన్యురుంగ్, ఫిలిప్పీన్స్ లో అణగారిన వర్గానికి చెందిన మటిగ్ సలూగ్ తెగ కోసం సేవా కార్యక్రమాలు చేపట్టిన టీచర్ రాండీ హలాసన్ కూడా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. వీరే కాకుండా పాకిస్థాన్ లో బాలికల విద్య కోసం పాటుపడుతున్న 'ది సిటిజన్స్ ఫౌండేషన్' కూడా మెగసెసె అవార్డుకు ఎంపికైంది.

  • Loading...

More Telugu News