: బియాస్ బాధితులకు చెక్కులను పంపిణీ చేసిన హోంమంత్రి నాయిని
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో కొట్టుకుపోయి మరణించిన విద్యార్థుల కుటుంబాలకు తెలంగాణ హోంశాఖ మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు లక్షన్నర రూపాయల పరిహారాన్ని పంపింది. ఆ చెక్కులను ఇవాళ హోంశాఖ మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ... తెలంగాణ తొలి కేబినెట్ భేటీ జరిగిన రోజే ఆ దుర్ఘటన జరిగిందన్నారు. సమాచారం అందుకున్న వెంటనే హిమాచల్ ప్రదేశ్ కు బయల్దేరి వెళ్లామన్నారు. అక్కడ దాదాపు 700 మంది సహాయక సిబ్బందితో గాలింపు చర్యలను చేపట్టామన్నారు. గాలింపు చర్యలకు అయిన ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరించిందని హోంమంత్రి చెప్పారు. జూన్ 17వ తేదీన తెలంగాణ ప్రభుత్వం పరిహారం అందించిందని ఆయన పేర్కొన్నారు.