: మ్యాచ్ ఫిక్సర్లకు న్యూజిలాండ్ లో కఠినశిక్షలు
ఇకపై న్యూజిలాండ్ లో ఎవరైనా మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడితే ఏడేళ్ళ జైలు శిక్ష విధించనున్నారు. ఈ మేరకు కొత్త చట్టాలు ప్రవేశపెట్టారు. నేడు అక్కడి పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అన్ని వర్గాల మద్దతు లభించింది. దీనిపై న్యూజిలాండ్ క్రీడా శాఖ మంత్రి ముర్రే మెక్ కల్లీ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఫిక్సింగ్ జాఢ్యం నానాటికీ విస్తరిస్తోందని, క్రీడల మనుగడకు ఇది ఎంతో ప్రమాదకారి అని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సంయుక్తంగా వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో నూతన చట్టం ప్రవేశపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేగాకుండా, ఫిఫా అండర్-20 వరల్డ్ కప్ కూడా న్యూజిలాండ్ లో జరగనుంది.