: తుంగభద్ర డ్యాంలో పెరుగుతోన్న నీటిమట్టం
తుంగభద్ర జలాశయంలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో, అధికారులు డ్యాం నుంచి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయంలో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1629 అడుగులుగా ఉంది. తుంగభద్ర జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 52,432 క్యూసెక్కులుగా ఉంది.