: రోడ్డుపై చెత్త వేస్తున్నారా... జర జాగ్రత్త!


గ్రేటర్ హైదరాబాదులో రోడ్డుపై చెత్త వేస్తున్నారా?... అయితే, ఇక మీదట జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే, హైదరాబాదు మహానగరాన్ని సుందరంగా మార్చేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం నగరంలోని 8 రోడ్లను ఎంపిక చేసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లోని ఎనిమిది ప్రధాన రహదారులను చెత్త రహిత ప్రాంతాలుగా మార్చాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. జీహెచ్ఎంసీ ఎంపిక చేసిన ఈ రోడ్లపై ఎవరైనా చెత్త వేస్తే నడ్డివిరిగేలా జరిమానాలను విధించాలని నిర్ణయించింది. అయినా, వారు తీరు మార్చుకోకపోతే జైలుకు పంపేందుకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. కాబట్టి, నగరవాసులు చెత్త వేసే ముందు ఓసారి ఆలోచిస్తే... రానున్న రోజుల్లో ‘కొత్త అందాలను’ వీక్షించవచ్చు. హైదరాబాదును ‘క్లీన్ సిటీ’గా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది.

  • Loading...

More Telugu News